పితృదినోత్సవం
పితృదినోత్సవం ,
మాతృదినోత్సవం జరుపుకోవటం మన సంస్కృతి
కాకపోయినా మన జీవితాలలో నాన్న పాత్ర ఎంతో
ముఖ్యమైనది . అందుకనే ఈ రోజున నా మనసులోని భావాలను మీతో పంచుకోవాలనుకుంటున్నాను .
చరిత్రను చూస్తే కొంతమంది
జీవితగమ్యాలను నిర్దేశించటం లో తండ్రుల పాత్ర ప్రముఖంగా కన్పిస్తుంది . ఉదాహరణకు మన ప్రధాని శ్రీమతి
ఇందిరాగాంధి . తండ్రి జవాహర్లాల్ నెహ్రూ గారు రాసిన లేఖలు ఆమెకు ఎన్నో విషయాలలో మార్గదర్శకమయ్యాయి . అంతెందుకు మన ఓపెన్ మైండ్స్ పాఠశాల స్థాపనకు
కూడా మూలం తమ తండ్రి శ్రీ సుధాకర రెడ్డి గారి ఆశయమేనని, మన డైరెక్టర్ శ్రీమతి షర్మిల గారు చెప్పారు.
అంతెందుకు
చిన్నప్పుడు ఒక్కొక్కసారి అమ్మ వద్దు అని
చెప్పిన కూడా , మనం కావాలి అని అడిగినవి తెచ్చి ఇచ్చింది నాన్నెకదా !
ఇలాంటివి మన0దరి జీవితాల్లో తీపి జ్ఞాపకాలుగా
వుంటాయి.
ఈ సందర్భంలో నేను మా నాన్న
గారి మాటలు గుర్తు చేసుకుంటూ వుంటాను. ‘ మనం పని చేసే చోట ఎంతో నిజాయితీ గా వుండాలి. క్రమశిక్షణగా వుండాలి. మన అసంతృప్తి
,వ్యక్తిగత సమస్యలు పనిలో చూపించకూడదు .’అని చెప్తువుండేవారు.ఆ
మాటలని ఆచరించటానికి నేను ప్రయత్నిస్తూ
వుంటాను.
ఒక ఉపాధ్యాయినిగా నేను ఎంతో మంది తండ్రులను చూశాను. వారి
కళ్ళల్లో వారి పిల్లల పట్ల కనిపించే అనురాగం, తమ పిల్లలు
ప్రపంచం లో అందరి కన్నా గొప్పవారిగా అవ్వాలి అనే ఆశ చూశాను.
మారుతున్న ఈ కాలంలో తల్లులతో పాటు తండ్రులు కూడా పిల్లల
బాగోగులు పట్టించుకోవలసివస్తోంది. వారికై ఎక్కువ సమయం కేటాయించవలసి వస్తోంది.
సహజంగా ఆడపిల్లలను
నాన్నకూచి అంటువుంటారు. ఉమ్మడి కుటుంబాలు తగ్గిపోయి,ఒక్కరిద్దరు పిల్లలే వుంటున్న ఈ రోజుల్లో ఆడపిల్లలే తల్లి
తండ్రుల బాధ్యత
తీసుకుంటున్నారు.
మన ముద్దుమురిపాలను తీర్చి, మన భవిష్యత్తును తీర్చిదిద్దటానికి పాటుపడే నాన్నకు జేజేలు
చెపుదాం. ముసలితనంలో అమ్మానాన్నలకు అండగా నిలుద్దాం. వారికి
ఆనందాన్ని కలిగిద్దాం.
నాన్నా!! ఓ నాన్నా!!
నీవు అందరికన్నా ఎంతో మిన్న
నీవు దిద్దించిన ఓనమాలు
నేర్పించాయి ఎన్నో పాఠాలు
నాపై నీకున్న ఆపేక్ష ( పిల్లల శ్రేయస్సుకై శ్రమించే ప్రతి
తండ్రికి
నా జీవితానికి శ్రీరామరక్ష నమస్సుమాంజలులతో,)
గుర్తుంచుకుంటాను నీ మాట -విజయలక్ష్మి
వేసుకుంటాను నా జీవితానికి
పూలబాట తెలుగు ఉపాధ్యాయిని.
నీ కండదండగా వుంటాను ప్రతిచోట.
No comments:
Post a Comment